హైదరాబాద్: 28°C
వార్తలు

విమాన ప్రయాణికులకు మరో షాక్

పెరుగుతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల నేపథ్యంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌ను పెంచాయి. ఈ కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దేశీయ వన్-వే విమానాలపై సర్‌ఛార్జ్ రూ. 400 నుండి రూ. 1,200 వరకు, అలాగే అంతర్జాతీయ సర్వీసులపై 55 డాలర్ల నుండి 215 డాలర్ల వరకు అదనంగా భారం పడనుంది.