హైదరాబాద్: 28°C
వార్తలు

కోల్‌కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. విమానాశ్రయ ప్రాంగణంలో బాంబు అమర్చినట్లు, ఏ క్షణమైనా పేల్చివేస్తామంటూ అధికారులకు ఈమెయిల్ అందింది. దీంతో అప్రమత్తమైన CISF సిబ్బంది రంగంలోకి దిగి.. విమానాశ్రయ ప్రాంగణం, ప్రయాణికుల లగేజీని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.