ఢిల్లీలో నిర్వహించిన ఇండియా కూటమి ఎంపీల లంచ్ మీటింగ్ ముగిసింది. రాజ్‌ఘాట్ వద్ద ప్రార్థనలు చేయాలని ఎంపీలు నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. గాంధీ తెచ్చిన స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని, ఓటు హక్కును కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. స్వాతంత్య్రాన్ని హరిస్తున్న వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని రాజ్‌ఘాట్ వద్ద ప్రార్థించనున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారు: ఖర్గే


