హైదరాబాద్: 28°C
వార్తలు

CEC నియామకంపై సుప్రీంలో పిటిషన్లు

సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం నియామకాలపై పిటిషన్లు దాఖలయ్యాయి. CEC జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్, వివేక్ జోషి నియామకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారని, సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.