హైదరాబాద్: 28°C
వార్తలు

CEC జ్ఞానేశ్ కుమార్‍కు సెక్యూరిటీ పెంచిన కేంద్రం

CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జ్ఞానేశ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆయనకు ఇప్పటికే ఉన్న Z+ కేటగిరీ భద్రతకు అదనంగా మరింత మంది పారామిలటరీ సిబ్బందిని, కమాండోలను మోహరించింది. ఢిల్లీ నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.