హైదరాబాద్: 28°C
వార్తలు

ఐరాస వేదికగా పాక్‌కు భారత్ చురకలు

పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదం అనే ఫ్రాంకెన్‌స్టీన్ రాక్షసి.. ఇప్పుడు ఆ దేశాన్నే వెంటాడుతోందని ఐరాస వేదికగా భారత్ చురకలంటించింది. పొరుగు దేశంలో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రమూకలను ప్రోత్సహించిందని మండిపడింది. అయితే ఇప్పుడు అదే ఆ దేశంలో అశాంతిని సృష్టిస్తోందని ధ్వజమెత్తింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ బాధిత దేశంగా నటించడం ఎట్టిపరిస్థితుల్లో చెల్లదని పేర్కొంది.