హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసులకు ఆ అధికారం ఎవరూ ఇచ్చారు?: సీజేపీ

ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు ఎవరూ రావొద్దని ఢిల్లీ పోలీసులు పిలుపు ఇవ్వడంపై సీజేపీ మండిపడింది. ధర్నాకు రావొద్దని పిలువు ఇవ్వడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సీజేపీ నేత సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ప్రజలు నిరసనలో పాల్గొనాలా? వద్దా? అని అప్పీల్ చేయడానికి పోలీసులకు అధికారం ఎవరూ ఇచ్చారని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లుండి తామంతా శాంతియుతంగా నిరసన చేపడతామన్నారు.