హైదరాబాద్: 28°C
వార్తలు

సుపరిపాలనకు ఫోన్‌ కీలకంగా మారింది: ప్రధాని

గత పదేళ్ల కాలంలో ఫోన్ ఒక సమాచార సాధనంగానే కాకుండా సుపరిపాలనకు కీలకంగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియాలో ఫోన్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ప్రస్తుతం వందలాది ప్రభుత్వ సేవలు దీని ద్వారానే ప్రజలకు నేరుగా అందుతున్నాయని వెల్లడించారు. డిజిటల్ విద్యకు కూడా ఇది మరింత ఊతమిచ్చిందన్నారు. దీని వల్ల ప్రజల ప్రయాణ భారం, లైన్లలో నిలబడే నిరీక్షణ సమయం తగ్గిందని పేర్కొన్నారు.