ఢిల్లీలోని న్యూ సిమాపురిలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నాలుగు నెలల గర్భిణి మృతి చెందింది. మరో 8 మంది గాయపడ్డారు. శిథిలాల కింద 11 మంది చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. అయితే ఘటనాస్థలంలో పలు శరీర భాగాలు లభించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
వార్తలు
కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి


