తమిళనాడులో భాషా విధానంపై మరోసారి వివాదం రాచుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే మందుల కవర్లపై తమిళం, ఇంగ్లిష్‌తో పాటు హిందీలోనూ వివరాలు ముద్రించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కోయంబత్తూరు, కరూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు భాషల్లో ముద్రించిన మందుల కవర్ల పంపిణీని నిలిపివేశారు.
వార్తలు
మందుల కవర్లపై రగడ.. పంపిణీ నిలిపివేత


