హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంకు మాతృవియోగం

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రూపిసోరెన్(80) రాంచీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రూపి స్వగ్రామమైన నెమ్రాలో ఆమె అంత్యక్రియలను ఇవాళ నిర్వహించనున్నారు. కాగా, ఆమె 1999లో దుమ్కా స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు.