హైదరాబాద్: 28°C
వార్తలు

పటేకర్ మృతి బాధాకరం: దుర్గేష్

AP: ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం తెలిపారు. హిందీతో పాటు పలు భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. పటేకర్ మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.