TG: దక్షిణాది రాష్ట్రాల్లో టీజీసీఎస్‌బీ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి 101 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సోదాలు జరిగాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల మోసాలతో పాటు 1,172 సైబర్ నేరాలతో వీరికి సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. ముగ్గురు కీలక నిందితుల వాంగ్మూలంతో ఎస్పీల నేతృత్వంలో ఈ భారీ స్కామ్ డొంక కదిలింది.
వార్తలు
రూ.17 కోట్ల మోసం.. 1,172 సైబర్ నేరాలు


