హైదరాబాద్: 28°C
వార్తలు

నీళ్లెత్తుకుపోతారని డ్యామ్‌ వద్ద 24 గంటలు నిఘా

ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు ఎదురవ్వడంతో డ్యాముల వద్ద అధికారులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ నీటి తరలింపులను అరికట్టడానికి మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని వాన్ డ్యామ్ వద్ద ప్రత్యేక అధికారులతో 24 గంటల పాటు నిఘాను ఏర్పాటు చేశారు. అనధికారిక హైపవర్ పంపులు, అక్రమ పైపులైన్లతో నీటిని తరలించాలని చూస్తే వాటిని ధ్వంసం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.