కర్ణాటక మంత్రులను సీఎం డీకే శివకుమార్ హెచ్చరించారు. మంత్రులపై కొందరు స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రానున్న MLC ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనతాదళ్ ప్రత్యేక ఏజెన్సీలను రప్పించి మంత్రులపై నిఘా పెట్టినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఐదుగురు మంత్రులపై నిఘా ఉంచినట్లు సమాచారం వచ్చిందన్నారు. అలాగే 40 మంది ఎమ్మెల్యేల ఆదాయ వనరులపై ఈడీ ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
మంత్రులను హెచ్చరించిన సీఎం


