హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రముఖ నటుడికి కేబినెట్ హోదా

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి ప్రభుత్వంలో అత్యున్నత హోదా కల్పించింది. సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖకు ప్రత్యేక సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో కూడిన ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చక్రవర్తి ఆ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది.