సౌదీ అరేబియా, హౌతీల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. తాజాగా సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్లతో హౌతీలు దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన సౌదీ అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వార్తలు
విమానాశ్రయాలపై హౌతీల దాడి.. ముగ్గురి మృతి


