హైదరాబాద్: 28°C
వార్తలు

పరిశుభ్ర నగరంలో పేరుకున్న చెత్త కుప్పలు

దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్ ఇందౌర్ పేరు పొందిన విషయం తెలిసిందే. తాజాగా పారిశుధ్య కార్మికులు సమ్మె ప్రకటించడంతో నగరంలో చెత్తకుప్పలు భారీగా పేరుకుపోయాయి. 3 రోజులుగా సాగుతున్న సమ్మె కారణంగా చెత్త సేకరించే వాహనాలు పలు ప్రాంతాలకు వెళ్లకపోవడంతో చెత్త పేరుకుపోతోందని స్థానికులు వాపోతున్నారు. తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ తాత్కాలిక పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగారు.