హైదరాబాద్: 28°C
వార్తలు

పిడుగు తాకిన ఇండిగో విమానం

17 వేల అడుగుల ఎత్తులో పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని పిడుగు తాకింది. దీంతో విమానం ముందు భాగం కొంత దెబ్బతింది. అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని లఖ్‌నవూ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు.