పట్నా నుంచి లక్నో వస్తున్న ఇండిగో 6E925 విమానంపై పిడుగు పడటంతో ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఘటన తీవ్రతను పైలట్లు వెంటనే అంచనా వేయలేకపోయారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులోని 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందికి పెనుప్రమాదం తప్పింది. విమానం ముందుభాగం డిజైన్ కారణంగానే ప్రమాదం జరగలేదని నిపుణులు తెలిపారు.
వార్తలు
ఇండిగో విమానానికి తప్పిన పెనుప్రమాదం


