హైదరాబాద్: 28°C
వార్తలు

సీఐఐ సదస్సు.. 25 సంస్థలతో ఒప్పందాలు

AP: విశాఖ ఐఐఎంలో జరిగిన సీఐఐ ప్రాంతీయ భాగస్వామ్య సదస్సుకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో 25 సంస్థలతో ఒప్పందాలు జరగగా, 19 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, కూటమి ప్రభుత్వ సమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రం ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ డెస్టినేషన్‌గా మారుతోందని ఆయన పేర్కొన్నారు.