హైదరాబాద్: 28°C
వార్తలు

మౌలిక వసతుల కల్పనకు చర్యలు: మంత్రి

TG: మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 15 కోట్ల UIDF నిధులు మంజూరయ్యాయని మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. 14వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. త్వరలో రూ. 40 కోట్లతో పనులు ప్రారంభిస్తామన్నారు. అమృత్ పథకం ద్వారా తాగునీరు, సీసీ కాలువల నిర్మాణం చేపట్టి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.