TG: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ వెళ్తున్న ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఎంపీలపై పోలీసులు చేయి చేసుకోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
పోలీసులపై రేణుకా చౌదరి ఫైర్


