TG: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. ఊర్కొండ మండలంలోని పలు గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
'మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట'


