హైదరాబాద్: 28°C
వార్తలు

'గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలు ఉపేక్షించొద్దు'

TG: సామాజిక బహిష్కరణలు, జరిమానాల పేరుతో ప్రజలను వేధిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ స్పష్టం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో కమిషన్ సభ్యులతో కలిసి బాధితులతో ఆయన భేటీ అయ్యారు. సుమారు 90 మంది బాధితుల నుంచి లిఖితపూర్వక అర్జీలు స్వీకరించారు. ఈ జాడ్యాన్ని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.