ఏపీకి చెందిన యువకులు తిరుపతి నుంచి చేపట్టిన బైక్ యాత్ర కాశీకి చేరుకుంది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. 'సేవాభావం, సుపరిపాలన లక్ష్యంగా ఈ యాత్ర చేశారు. కృష్ణా, గోదావరి జలాల్ని గంగా జలంతో కలిపి కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేయడం గొప్ప విషయం' అని అన్నారు. కాగా, మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని తెలుగు యువత, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టారు.
వార్తలు
ఏపీ యువకుల బైక్ యాత్ర.. స్పందించిన ప్రధాని


