ప్రకాశం: మార్కాపురం జిల్లాకు 11 సీజనల్ హాస్టళ్లు మంజూరయ్యాయి. ఉపాధి కోసం వలస వెళ్లే కుటుంబాల పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 558 మంది విద్యార్థులను గుర్తించారు. బేస్తవారిపేటలో 4, గిద్దలూరు, సీఎస్‌పురం, తర్లుపాడు మండలాల్లో 2 చొప్పున, కొమరోలులో ఒక హాస్టల్ ఏర్పాటు చేయనున్నారు. నవంబర్ 1 నుంచి హాస్టళ్లు ప్రారంభమవుతాయి.
వార్తలు
వలస పిల్లల చదువుకు సీజనల్ హాస్టళ్లు


