హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినోతో ఢిల్లీకి కాలుష్య ముప్పు!

ఢిల్లీలో శీతాకాలపు గాలి నాణ్యతపై ఎల్‌నినో ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. ఈ శీతాకాలం వాయు కాలుష్యం మరింత తీవ్రం కావచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాలు తగ్గితే కాలుష్య కారకాలు గాలిలో ఎక్కువకాలం నిలిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో ఈ ఏడాది చివరి వరకు బలపడొచ్చని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ తెలిపింది.