MDK: తూప్రాన్ పరిధిలోని రావెల్లి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో సాయంత్రం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రజని రాఘవేందర్ గౌడ్, వైస్ చైర్‌పర్సన్ సమతా కాశిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు.
వార్తలు
VIDEO: ముందస్తు బతుకమ్మ సంబరాలు


