హైదరాబాద్: 28°C
వార్తలు

వార్డుల పెంపు.. సలహాల స్వీకరణ

కృష్ణా: గుడివాడ పురపాలక సంఘంలో వార్డుల సంఖ్య 39 నుంచి 48కి పెంచుతూ రూపొందించిన ముసాయిదా విభజన ప్రతిపాదనలు ప్రజల పరిశీలనకు ఉంచారు. జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా విభజన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదనలపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను అక్టోబర్ 8 నుంచి 14వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు.