హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: రాహుల్ గాంధీ విడుదల

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు బరఖాంబ స్టేషన్ నుంచి రాహుల్ గాంధీని విడుదల చేశారు. దీంతో ఆయన ఢిల్లీలోని ఇంటికి చేరుకున్నారు. అంతకుముందు రాహుల్ గాంధీని బరఖాంబ, ప్రియాంకా గాంధీని ఛత్రసాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరినీ పోలీసులు విడుదల చేశారు.