MHBD: గూడూరులో విజయదశమి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హిందూ ఉత్సవ సమితి, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక రామ్‌లీలా మైదానంలో రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రావణాసుర వధ కటౌట్ పనులను సర్పంచ్ సునీత కొమ్మాలునాయక్ ప్రారంభించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్తలు
గూడూరులో రావణాసుర వధ కటౌట్ పనులుప్రారంభం


