AKP: జిల్లాలో తొలగించిన 1,09,819 మంది ఓటర్ల స్థితిగతులపై గురువారం నుంచి బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి పునఃపరిశీలన చేయనున్నారని డీఆర్వో తెలిపారు. ఎవరైనా అర్హులైన ఓటరు పొరపాటున తొలగింపునకు గురైతే ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 16న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని, అందులో పేర్లు లేనివారు నిరంతర నవీకరణలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
నేటి నుండి ఓటర్ల పునఃపరిశీలన


