సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని 'కాక్రోచ్ జనతా పార్టీ' అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని నిరసిస్తూ అక్టోబర్ 10న జంతర్‌మంతర్ వేదికగా నిరసన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనకు దేశవ్యాప్తంగా ఉన్న యువత భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
జ్ఞానేష్ కుమార్‌పై పోరాటం ఆగదు: సీజేపీ


