హైదరాబాద్: 28°C
వార్తలు

​కల్హేర్‌లో చెరువు బుంగ పూడ్చివేత

SRD: కల్హేర్ పడిగెల చెరువుకు పడిన బుంగను ఇరిగేషన్ అధికారులు బుధవారం ఎక్స్‌కవేటర్‌తో పూడ్చివేశారు. బుంగ కారణంగా నీరు వృథా కావడంతో ఆందోళన చెందిన ఆయకట్టు రైతులు, అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. సమయానికి నీటి వృథాను అరికట్టడంతో గ్రామస్థులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.