SRCL: ముస్తాబాద్ మండలం ఆవునూరు, తుర్కపల్లి గ్రామాల్లో తెలంగాణ రక్షణ సేనలోకి బుధవారం భారీగా చేరికలు జరిగాయి. ఇన్‌ఛార్జ్ మజీద్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అధినేత కవితక్క సేవలకు ఆకర్షితులై చేరుతున్నామని తెలిపారు. 90 ఏళ్ల మాదారపు వెంకటవ్వ స్వయంగా వచ్చి పార్టీలో చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వార్తలు
తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు


