హైదరాబాద్: 28°C
వార్తలు

వాళ్లు విద్యార్థులే.. సంఘవిద్రోహులు కాదు: హైకోర్టు

మహారాష్ట్రలో MPSC పరీక్షలో అవకతవకలపై విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. నిరసనలు తెలిపేవారు విద్యార్థులేనని.. సంఘ విద్రోహ శక్తులు కాదని పేర్కొంది. ఉద్యోగ నియామక పరీక్షలు అక్రమాలు లేకుండా జరిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. పరీక్షలపై విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పింది.