హైదరాబాద్: 28°C
వార్తలు

సినిమా చేసి మళ్లీ ప్రజలను అలరించండి: సుప్రీం

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తన బకాయిల్లో భాగంగా రూ.1.15 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌తో కోర్టుకు హాజరైన రాజ్‌పాల్.. మిగిలిన రూ.8.5 లక్షలను చెల్లించేందుకు అక్టోబర్ 13 వరకు సమయం ఇవ్వాలని కోరాడు. దీంతో న్యాయస్థానం అతడికి రెండు వారాల గడువు ఇచ్చింది. ప్రజలను అలరించే మంచి సినిమాలు చేయాలని సూచించింది.