హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత

ఢిల్లీలో విపక్ష ఎంపీల సమావేశం ముగిసింది. మరోసారి ఈసీ కార్యాలయానికి వెళ్లాలని విపక్ష ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ పోరాటం కొనసాగుతోందని నేతలు వెల్లడించారు. దీంతో ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సీఈసీ కార్యాలయం దగ్గర పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.