హైదరాబాద్: 28°C
వార్తలు

విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

యూపీ బృందావన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బృందావన్‌లోని ఓ గురుకుల పాఠాశాల ట్యాంక్ శుభ్రం చేసే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.