హైదరాబాద్: 28°C
వార్తలు

25 ఏళ్ల ప్రస్థానం విజయం కాదు.. సేవ: మోదీ

సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చని ప్రధాని మోదీ వెల్లడించారు. 25 ఏళ్లు అంటే ఒక విజయంగా కాదని.. సేవగానే భావిస్తానని చెప్పారు. అడవుల్లో గిరిజన సమాజాలకు సేవ చేయడంలో తన సమయాన్ని గడిపినట్లు తెలిపారు. సేవ చేయాలన్న తపనతోనే బీజేపీ సంస్థాగత బాధ్యతల మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. తానెప్పుడూ రాజకీయాల్లో వెలగాలనుకోలేదని.. అలా ఆలోచించి ఉంటే ఎప్పుడో వచ్చేవాడినని పేర్కొన్నారు.