హైదరాబాద్: 28°C
వార్తలు

అదే నా జీవిత ఆశయం: మోదీ

ఆత్మనిర్భర్ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు. అలాగే అంతరిక్షంలో అడుగుపెట్టడం, ఒలింపిక్స్ నిర్వహణ ఇలాంటివన్ని కూడా సాధ్యమేనని పేర్కొన్నారు. ఒక లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు.. తను ఎప్పటికీ అలిసిపోనని తెలిపారు. భారత్ అభివృద్ధే తన జీవిత ఆశయం అని వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటానని చెప్పారు.