హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయను: మోదీ

ప్రజా సేవ చేసేందుకే తనకు భగవంతుడు శక్తినిచ్చారని PM మోదీ చెప్పారు. ఎప్పుడూ సేవ చేయాలనే ప్రజలు తనను ఎన్నుకున్నారని తెలిపారు. ప్రజలు తనపై ఎంతో విశ్వాసం ఉంచారని.. దాన్ని ఎప్పటికీ వమ్ము చేయనన్నారు. ప్రజలకు సేవ చేయడంలో వెనుదిరిగేది లేదని వెల్లడించారు. తన దృష్టిలో ప్రజలే దేవుని స్వరూపమని పేర్కొన్నారు. దేశ ప్రజల విశ్వాసం, కార్యకర్తల అవిశ్రాంత శ్రమే తన అతిపెద్ద బలమని స్పష్టం చేశారు.