ప్రజా ఆశీర్వాద బలమే తనను ఇంతకాలం నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు 25 ఏళ్ల పాటు నిరంతర ప్రజాసేవ చేస్తానని ఊహించలేదన్నారు. తనకు ఆశీస్సులు అందించిన దేశ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను ఎన్నటికీ మరిచిపోలేనని, ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేవ చేస్తానని పేర్కొన్నారు.
వార్తలు
ప్రజా ఆశీర్వాద బలమే తనను నడిపించింది: ప్రధాని


