హైదరాబాద్: 28°C
వార్తలు

శిక్షణా విమానానికి తప్పిన ప్రమాదం

కర్ణాటకలోని కలబురగి విమానాశ్రయం సమీపంలో శిక్షణా విమానానికి పెను ప్రమాదం తప్పింది. శిక్షణ ఇస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని పైలట్లు కంది పంట వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా కిందకు దిగడంతో ప్రమాదం తప్పి, ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.