సాధారణ మహిళనైనా యూనిఫాంలో ఉన్న మహిళనైనా గౌరవించాల్సిందేనని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారిణి తెలిపారు. వివిధ నిరసనల్లో పాల్గొనే మహిళలను అదుపుచేయడానికి మహిళా పోలీసులనే వినియోగిస్తున్నట్లు చెప్పారు. అయితే పురుష ఆందోళనకారులు మహిళా సిబ్బందిపై చెడుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మహిళా పోలీసులపై దాడి చేయడం, దుస్తులు చింపివేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వార్తలు
'యూనిఫాంలో ఉన్న మహిళలనూ గౌరవించాలి'


