హైదరాబాద్: 28°C
వార్తలు

మా కార్యకర్తలను ఆందోళనలో పాల్గొనవద్దంటున్నారు: సీజేపీ

ఢిల్లీలో తలపెట్టిన ఆందోళనలో పాల్గొనవదంటూ తమ కార్యకర్తలపై మహారాష్ట్ర పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని సీజేపీ నేత అభిజీత్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు నోటీసులు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల తీరు ఓ రకమైన నియంతృత్వంలా ఉందని విమర్శించారు. సీఎం దేవేంద్ర తన రాజకీయ లక్ష్యాల కోసం పోలీసులను వినియోగించుకోరాదని ధ్వజమెత్తారు. సీఎం ఎందుకు యోగి 2.0గా ఉండాలని యత్నిస్తున్నారని నిలదీశారు.