ఢిల్లీలో భూకంపం సంభవించింది. నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. ఢిల్లీతో పాటు హరియాణా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంపం కారణంగా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
ఢిల్లీలో భూకంపం..


