హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గరిష్ట పరిమితిని విధించింది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సభ్యుడు రూ.2 లక్షలు, మున్సిపాలిటీ వార్డు సభ్యుడు రూ.1.5 లక్షలు, నగర పంచాయతీ వార్డు సభ్యుడు రూ.లక్ష వరకు మాత్రమే ఖర్చు చేయాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది.