హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓ స్త్రీ రేపు రా'.. భయాందోళనలో ప్రజలు

AP: అనంతపురం జిల్లా పామిడి మండలం అప్పాజీపేటలో ‘స్త్రీ’ సినిమాను తలపించేలా గోడలపై వింత రాతలు కలకలం రేపుతున్నాయి. రాత్రి వేళల్లో ఇళ్లపై అకస్మాత్తుగా రాళ్లు పడుతుండటంతో పోలీసుల పహారా ఉన్నప్పటికీ గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సాయంత్రం దాటితే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.